సీట్ల త్యాగానికైనా సిద్ధమే: కాంగ్రెస్‌ | RC Khuntia Comments On Seat Adjustment In Telangana Elections | Sakshi
Sakshi News home page

సీట్ల త్యాగానికైనా సిద్ధమే : కుంతియా

Oct 23 2018 1:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

RC Khuntia Comments On Seat Adjustment In Telangana Elections - Sakshi

తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో సహా పలు పార్టీలతో పొత్తుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ‘మహాకూటమి’ లో సయోధ్య చెడిందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి ఉమ్మడి లక్ష్యమైన కేసీఆర్‌ ఓటమికై కాంగ్రెస్‌ పార్టీ సీట్ల త్యాగానికి కూడా సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు మిగతా పార్టీలన్నీ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక వర్గాలు, గెలిచే అభ్యర్థుల ప్రతిపాదికగా సీట్ల కేటాయింపు అంశమై చర్చలు జరుపుతున్నామని కుంతియా పేర్కొన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాట్ల విషయం త్వరగా పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బీసీలకు కేసీఆర్‌ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి 15 మంది ఆశావహులు ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement