మోదీపై ట్వీట్‌.. పదవికి రాజీనామా..!

Ramya Resign To Congress Social Media Chief Post - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చీఫ్ రమ్య (దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తొంది. అయితే ఆమె పదవికి మాత్రమే రాజీనామా చేశారని, కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతారని కాంగ్రెస్‌ వర్గాలు ప్రకటించాయి. సోషల్‌ మీడియాలో దూకుడుగా వ్యవహిరించే రమ్యకు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారడంతోనే పదవి నుంచి తప్పుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మోదీ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేసి ఆయనను ‘దొంగ’గా అభివర్ణిస్తూ ఆమె చేసిన వివాదం రేపింది.

దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ.. దేశ ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ట్వీట్‌ చేశారని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దేశ ఖ్యాతిని, సార్వభౌమాధికారాన్ని దిగజార్చేవిధంగా ఆమె ట్వీట్‌ ఉందని ఢిల్లీకి చెందిన న్యాయవాది సయ్యద్‌ రిజ్వార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో రమ్య దూకుడుగా వ్యవహరించారు. ఆమె రాజీనామా వార్తలను కాంగ్రెస్‌ అధిష్టానం ఇంకా ధ్రువీకరించాల్సిఉంది.

చదవండి : మాజీ ఎంపీ రమ్యపై రాజద్రోహం కేసు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top