రాజీవ్‌ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు | Rajiv Gandhi Foundation got funds from PMNRF during UPA regime | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు

Jun 27 2020 6:28 AM | Updated on Jun 27 2020 7:19 AM

Rajiv Gandhi Foundation got funds from PMNRF during UPA regime - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యూపీఏ హయాంలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి భారీగా నిధులు అందాయని బీజేపీ ఆరోపించింది. ప్రధాని సహాయ నిధికి వచ్చి డబ్బుని రాజీవ్‌ ఫౌండేషన్‌కు మళ్లించ డం దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమేనని బీజేపీ జాతీయ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని సహాయ నిధి నుంచి నిధుల మళ్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు.

‘‘కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రధాని సహాయ నిధికి వచ్చిన నిధుల్ని యూపీఏ హయాంలో రాజీవ్‌  ఫౌండేషన్‌కు మళ్లించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ బోర్డు సమావేశాల్లో అప్పట్లో సోనియాయే కూర్చొనేవారు. ఆర్‌జీఎఫ్‌కి ఆమే చైర్‌ పర్సన్‌. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడినందుకు సోనియా బాధ్యత వహించాలి’’అని నడ్డా ట్వీట్‌ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముల్ని ఒక కుటుంబానికి ధారపోయడం అంటే దేశ ప్రజల్ని పచ్చి దగా దేయడమేనని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా నడ్డా ఆరోపణల్ని కాంగ్రెస్‌ పార్టీ తిప్పి కొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement