
న్యూఢిల్లీ/ముంబై: దేశ ప్రజల్లో ప్రేమ, కరుణ పెంపొందించడం ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. తమ వాదనే సరైందని నమ్మకం కలిగించేందుకు ప్రధాని∙మోదీ ప్రజల మనసుల్లో విద్వేషం, భయం, ఆగ్రహాన్ని పాదుకొల్పుతున్నారని ఆరోపించారు. విద్వేషం బదులు ప్రజల్లో ప్రేమ, కరుణ ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని చెప్పేందుకు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని ఆయన శనివారం ట్వీటర్‌లో పేర్కొన్నారు.