బీజేపీకి నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్! | Prakash Raj Encounters BJP In His Tweet | Sakshi
Sakshi News home page

బీజేపీకి నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్!

May 19 2018 8:28 PM | Updated on Sep 5 2018 1:55 PM

Prakash Raj Encounters BJP In His Tweet - Sakshi

బెంగళూరు: గత కొన్ని నెలలుగా ఎన్నో అంశాల్లో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా బీజేపీకి మరో కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టకుండానే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగా.. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌ స్పందించారు. ‘ఆట మొదలు పెట్టకముందే అయిపోయింది. కర్ణాటక కాషాయ రంగు పులుకోవడానికి ఇష్ట పడటం లేదు. అయినా ఎంతో రంగులమయంగా ఉంది. ఆట అప్పుడే ముగిసింది.  56వ గంట గురించి ఆలోచించొద్దు. 55వ గంటకే వాళ్ల ఆట ముగిసింది. జోక్స్‌ను పక్కనపెట్టి చూడండి. మరిన్ని చెత్త రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ’ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. 

మరోవైపు యడ్యూరప్ప రాజీనామాతో కాంగ్రెస్-జేడీఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కేబినెట్ కూర్పుపై ఆదివారం కాంగ్రెస్‌ నేతలతో కాబోయే సీఎం కుమారస్వామి చర్చించనున్నారు. సోమవారం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి గవర్నర్‌ను కలుసుకుని పరిస్థితి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement