
సాక్షి, బెంగళూరు : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ ఖాతాలో ఓ వీడియాను పోస్ట్ చేశారు. హిట్లర్‌కు, మోదీకు ఎలాంటి తేడా లేదంటూ ఆ వీడియో సాగింది. 24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పలు మోదీ, హిట్లర్ ఫోటోలు ఉన్నాయి. కాగా గతంలో మోదీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీపై అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి మోదీపై విమర్శలకు దూరంగా ఉన్న ప్రకాశ్.. తాజా వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చారు.
RE INCARNATION.... who did this. #JustAsking pic.twitter.com/1HPbsSfAU2
— Prakash Raj (@prakashraaj) January 6, 2020