
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్ : టీఆర్‌ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..రైతులకు 24 గంటల కరెంట్ కావాలని ఎవరు అడిగారని..ఇప్పుడు 12 గంటల కరెంటు చాలని ఎవరు తీర్మానం చేయమన్నారని టీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. జడ్పీలో తీర్మానం ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్ తీర్మానం చేయమనడం ఏం సూచిస్తుందని అడిగారు. నిధులు, విధుల విషయంలో చర్చించకుండా, ప్రజాసమస్యలపై చర్చించకుండా మొక్కుబడి సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో విమర్శిస్తే కేసులు పెడతామంటే భయపడమని చెప్పారు. కేసీఆర్ దొంగ, అవినీతిపరుడని తప్పకుండా విమర్శిస్తామని హెచ్చరించారు.