
సాక్షి, హైదరాబాద్: ప్రజల దృష్టిని మరల్చేందుకే ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభలంటూ సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రగతి నివేదన సభలో ప్రజలకు వాస్తవాలను చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం అసెంబ్లీ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు. ప్రధాని మోదీతో విభజన హామీలను ప్రస్తావించాలన్నారు. అవినీతిపై సీఎం కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్‌కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై ప్రగతి నివేదన సభలో చెప్పాలన్నారు. కాగా కేరళ వరద బాధితులకు పొంగులేటి రూ.లక్ష విరాళం ప్రకటించారు. చెక్‌ను రాజీవ్ గాంధీ నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు పంపారు.