ఆ విషయంలో సీఎంగా కేసీఆర్‌ రికార్డు: పొంగులేటి 

Ponguleti comments on CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగున్నరేళ్లలో ప్రగతిభవన్, సచివాలయంలో ప్రతిపక్షాలకు కలిసే అవకాశమివ్వని సీఎంగా కేసీఆర్‌ రికార్డుకెక్కారని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ, భద్రాచలానికి సంబంధించి ఆ 4గ్రామాలను రాష్ట్రంలో కలపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదన్నారు.

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై మంత్రివర్గం ఆమోదించాలని కోరారు. ఉద్యమంలో 1,200 మంది చనిపోతే 500 మందిని మాత్రమే గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమ నాయకులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ సంకుచిత మనస్తత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top