ప్రజలు వైఎస్‌ జగన్‌ని కోరుకుంటున్నారు | People Wants YS Jagan Says Mudunuri Prasad Raju | Sakshi
Sakshi News home page

ప్రజలు వైఎస్‌ జగన్‌ని కోరుకుంటున్నారు

Mar 21 2019 4:08 PM | Updated on Mar 21 2019 5:09 PM

People Wants YS Jagan Says Mudunuri Prasad Raju - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వంపై విసిగి, మోసపోయి ప్రజలు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కోరుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజు వ్యాఖ్యానించారు. గురువారం నరసాపురం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో  వైస్సార్‌ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కావురు శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ రాజు మాట్లాడుతూ.. తాము పూర్తిగా, సంపూర్ణంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తామిద్దరూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులుగా పూర్తి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అవతల  అభ్యర్థి ఎవరనేది చూడకుండానే 5వ సారి పోటీ చేస్తున్నానని వెల్లడించారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అసెంబ్లీ స్థానానికి నెంబర్ వన్‌గా నామినేషన్ ఎలాగైతే వేశారో.. అదే విధంగా  నెంబర్ వన్ స్థానంలో ప్రసాద్ రాజు గెలుస్తారని జోష్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement