హామీలు అమలు చేయకపోవడం అన్యాయం | Pallam Raju Meets Telangana CS SK Joshi | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయకపోవడం అన్యాయం

Apr 4 2018 9:03 PM | Updated on Mar 23 2019 9:10 PM

Pallam Raju Meets Telangana CS SK Joshi - Sakshi

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పల్లంరాజు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పల్లంరాజు అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్‌ ఎస్‌కే జోషిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోషి పాత మిత్రుడు కావడంతోనే కలిసానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గత యూపీఏ ప్రభుత్వం, అప్పటి ప్రధాన మంత్రి అన్ని పార్టీలను ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అప్పటి కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తుందని, రాహుల్‌ గాంధీ కూడా ఇదే అంశంపై పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. తొలి నుంచే అందరూ కలిసి హోదా కోసం పోరాడాల్సిందన్నారు, ఇప్పటికైనా నిజాయితీగా కలిసికట్టుగా పోరాడి హోదా సాధించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement