టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం ఎలా ఇచ్చారు..? | Notice To Proddatur Municipal Commissioner | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం ఎలా ఇచ్చారు..?

Mar 15 2018 12:06 PM | Updated on Oct 16 2018 6:33 PM

Notice To Proddatur Municipal Commissioner - Sakshi

కమిషనర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

ప్రొద్దుటూరు టౌన్‌ : మున్సిపాలిటీలో ఒక స్వీపర్‌ మృతి చెందితే ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వకుండా టీడీపీ కార్యకర్తకు ఇవ్వడం బాధాకరమని, వెంటనే అతన్ని తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల వద్దకు ఎమ్మెల్యే బుధవారం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మికుడు సుబ్బ రాయుడు భార్య మేరి, వారి పిల్లలతో కలిసి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. అక్కడికి వచ్చిన కమిషనర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్మికుడు చనిపోతే సంబంధిత కాంట్రాక్టర్‌ మృతి చెందిన కార్మికుడి కు టుంబంలో ఉద్యోగం చేసే వారు లేకపోతే మరొకరికి ఇవ్వాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా మరొకరి పేరును ఎలా నమోదు చేశారని ప్రశ్నిం చా రు. 9 నెలల పాటు పార్కులో పని చేయించుకొని జీతం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

కాంట్రాక్టర్‌కే తెలియకుండా..
కార్మికుడు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో మరొకరిని నియమించాల్సింది కాంట్రాక్టర్‌ అని, అయితే కాంట్రాక్టరకే తెలియకుండా మేరువ కుమార్‌ అనే టీడీ పీ కార్యకర్తకు పోస్టింగ్‌ ఎవరిచ్చారని ఎమ్మెల్యే కమిషనర్‌ను ప్రశ్నించారు.  అవన్నీ తనకు తెలియవని కమిషనర్‌ చెప్పడంతో ఎమ్మెల్యే ఇది పద్ధతి కాదన్నారు. న్యా యం జరగకపోతే 48 గంటలు నిరా హార దీక్ష చేస్తానని హెచ్చరించారు.కార్మికుని కుమార్తెకు  రూ.లక్ష బాండు అందించిన ఎమ్మెల్యేసుబ్బరాయుడు కుమార్తెకు 20 ఏళ్ల నాటికి రూ.లక్ష వస్తుందని, అది పాపకు ఉపయోగపడే విధంగా బ్యాంకులో డిపాజిట్‌ చేశామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. చెప్పిన ఏడవ రోజే పాప పేరుతో డిపాజిట్‌ చేశామన్నారు.

బాండు పత్రాన్ని సుబ్బరాయుడు కుమార్తెకు అందించారు. వైఎస్‌ఆర్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు ట ప్పా గైబూసాహెబ్, రాగుల శాంతి, శివకుమార్‌యాదవ్, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారా యణరెడ్డి, మహిళా రాష్ట్ర కార్యదర్శి విజ యలక్ష్మి, వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు షెక్షావలి, చేనేత విభాగం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బడిమెల చిన్నరాజ, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు విజయ్‌కుమార్, ప్రమీలమ్మ, సాల్మన్‌ తదితరులు ఉన్నారు.

కాంట్రాక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే...
ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ రమణారెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. సుబ్బ రాయుడు మరణిస్తే అతని స్థానంలో అతని భార్యకు ఉద్యోగం ఇవ్వకుండా మరొకరిని ఎలా నియమించారని ప్రశ్నించారు. తనకు ఆ విషయమే తెలియదని, నాయకులే ఇష్టం వచ్చిన వారిని వేసుకొని పేర్లు రాయించుకున్నారని తెలిపారు.

ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్, చైర్మన్లకు జడ్జి నోటీసులు
లీగల్‌ (కడప అర్బన్‌) : జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అ వకతవకలపై వచ్చిన ఫిర్యాదు ను సుమోటోగా స్వీకరించి బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ కేసు నమోదు చేయడంతోపాటు ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్, చైర్మన్‌లకు నోటీసులు జారీ చేశారు. వారు ఈనెల 21వ తేదీన జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో డీఎల్‌ఎస్‌ఏ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement