ఆ సర్కార్‌ మనుగడ కష్టమే..

Nitin Gadkari Termed Shiv Sena NCP Congress Alliance As Opportunisti - Sakshi

రాంచీ : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కలయిక అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆరోపించారు. శివసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టినా ఆ ప్రభుత్వం ఎనిమిది నెలలకు మించి కొనసాగలేదని జోస్యం చెప్పారు. సిద్ధాంత వైరుధ్యాలున్న మూడు పార్టీలు చేతులు కలపడానికి అవకాశవాదమే మూలమని, బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకే ఈ పార్టీలు కలిశాయని విమర్శించారు. అసలు ఈ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని..ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆరు నుంచి ఎనిమిది నెలలకు మించి వీరు ప్రభుత్వాన్ని నడపలేరని దుయ్యబట్టారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడ్కరీ రాంచీలో జరిగిన సభలో మాట్లడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top