వాళ్లా పాండవులు?

Nirmala Sitharaman Fires On Rahul Gandhi Comments  - Sakshi

రాహుల్‌ ప్రసంగంపై మండిపడ్డ నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: గతంలో రాముడి అస్తిత్వాన్నే ప్రశ్నించిన పార్టీ నేడు తమను తాము పాండవులుగా చెప్పుకుంటారా అని బీజేపీ నేత, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ప్లీనరీలో రాహుల్‌ విమర్శలను తిప్పికొడుతూ.. సిక్కుల ఊచకోతకు, లక్షలకోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్‌ నేతలు.. పాండవులమని చెప్పుకోవటం విడ్డూరన్నారు. నరేంద్ర మోదీకి.. నీరవ్, లలిత్‌ మోదీలతో సంబంధమున్నట్లు చూపించే ప్రయత్నం పూర్తిగా అర్థరహితమని మంత్రి తెలిపారు.

‘నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన రాహుల్‌ గాంధీ.. మహాత్ముని ఇంటిపేరుతో ఉన్నారు. దీన్నెలా చూడాలి?’ అని ప్రశ్నించారు. ‘ఓ కేసులో తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినపుడు ఇం దిరా గాంధీ న్యాయవ్యవస్థపై ఎలా వ్యవహరించారో నేను గుర్తుచేయాలా? 1988లో రాజీవ్‌ గాంధీ ప్రెస్‌ హక్కులను కాలరాసే బిల్లును తీసుకొచ్చినంత పనిచేశారు. ఎమర్జెన్సీలో ఇందిర మీడియాతో ఎలా వ్యవహరించారు? ఆమె మనుమడు ఇప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరం’ అని ఆమె పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top