
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆధ్యాత్మిక భావాలు, సిద్ధాంతాలతో నటుడు రజనీకాంత్ ప్రారంభించబోయే రాజకీయ పార్టీతో తాను కలసి పనిచేసే అవకాశం లేదని నటుడు కమల్ హసన్ చెప్పారు. దివంగత రాష్ట్రపతి కలాం ఈ దేశం గురించి ఎన్నో కలలు కనేవారని, తనకూ అలాంటి కలలే ఉన్నాయని చెప్పారు. గతంలో ఒకసారి విమానంలో కలాంతో కలసి ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని, ఆ సందర్భంగా అనేక అంశాలపై తాము మాట్లాడుకున్నామని తెలిపారు. ద్రవిడ సిద్ధాంతం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా వ్యాపించి ఉందని వ్యాఖ్యానించారు. కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని రామేశ్వరంలోని దివంగత కలాం ఇంటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.