దెయ్యాలు వేదాలు వల్లించడమా!

National BC Welfare Secretary Derangula Uday Kiran Slams Chandrababu Naidu  - Sakshi

సాక్షి, సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్‌): మానవ హక్కుల కమిషన్‌ను నిర్వీర్యం చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు కమిషన్‌లో ఫిర్యాదు చేయడం దేయాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని శాఖలను విజయవాడకు తీసుకువచ్చి మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తలను మాత్రం హైదరాబాద్‌లోనే వదిలేసి ఇప్పుడు హక్కుల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కమిషన్‌ చైర్మన్, సభ్యులను నియమించాలని విన్నవించినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డిని నియమించి కమిషన్‌కే వన్నె తెచ్చారని కొనియాడారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top