నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు.. | Nara virus more dangerous than Corona, says Vijaya Sai Reddy | Sakshi
Sakshi News home page

కరోనా కంటే ‘నారా వైరస్‌’  భయంకరం

Mar 5 2020 6:23 PM | Updated on Mar 5 2020 6:51 PM

Nara virus more dangerous than Corona, says Vijaya Sai Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్‌తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా పడుతోంది’ అని ట్వీట్‌ చేశారు. (వణికి చచ్చేట్టున్నారు!: విజయసాయి రెడ్డి)

అలాగే ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తామసలు ఎన్నికల్లోనే పోటీ చేయమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడు. ఇది చంద్రబాబు చెప్పించిందే. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి. ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరు’  అని మండిపడ్డారు. (చంద్రబాబుది మామూలుగుండెకాదు)

‘రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసినా, ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికలు నిర్వహించలేదు. ఫలితంగా రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది. రిజర్వేషన్లపై కోర్టుకెళ్లి బీసీలకు ద్రోహం చేయడమే కాక నిధుల రాకను కూడా అడ్డుకుంటున్నారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement