‘లోకేష్‌కు కప్పం కడుతున్న ఎమ్మెల్యే’

Nara Lokesh Collects Money To Allow Illegal Mining Says Ambati - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ నేతలు అధికార మదంతో ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సహజ వనరులను అడ్డంగా దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ఆగడాలకు అధికారులు వంత పాడుతున్నారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ బాబుకు కప్పం కడుతూ మైనింగ్‌ పేరుతో శ్రీనివాస్‌ అందినంత దోచుకుంటున్నారని అంబటి ఆరోపించారు. గురజాలలో ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. 

గురజాల వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌ రెడ్డి మట్లాడుతూ.. పవిత్రమైన పల్నాడులో గంజాయి, నాటు సారా ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. మైనర్‌ బాలికపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. మైనింగ్‌ అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేనిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపించలేకపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటానని మహేష్‌ రెడ్డి సవాల్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top