కేసీఆర్‌ అవినీతిని బయటపెడతాం

Nagam Janardhan Reddy Slams CM KCR In Round Table Meeting - Sakshi

నాగం జనార్దన్‌రెడ్డి

ఖైరతాబాద్‌: ప్రగతి నివేదన– ప్రజా ఆవేదన పేరుతో సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్‌ అబోర్డులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల  మూడు నెలల పాలనలో వాగ్దానాలు, వైఫల్యాలపై రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, లాయర్లు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రాజెక్టుల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగిందన్నారు. అవినీతిపై నిరసన తెలిపేందుకు కూడా వీలు లేకుండా ధర్నా చౌక్‌ను ఎత్తేశారన్నారు. కేసీఆర్‌ అవినీతిని బట్టబయలు చేసేందుకే కేసులు వేశానన్నారు. అనంతరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. ఇండిపెంటెండ్‌ ఫోరం కన్వీనర్‌ శివప్రసాద్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ లింగేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాస రెడ్డి, రిటైర్డ్‌ ఇంజినీర్‌ దొంతు లక్ష్మీనారాయణ,  న్యాయవాది రామకృష్ణారెడ్డి,  శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top