సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు | Naam Tamilar katchi Party Appreciate YS Jagan Government | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

Jul 24 2019 2:55 PM | Updated on Jul 24 2019 6:49 PM

Naam Tamilar katchi Party Appreciate YS Jagan Government - Sakshi

సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తమిళ ప్రముఖ పార్టీ ‘నామ్ తమిళర్ కట్చి’ ప్రశంసల వర్షం కురిపించింది. తనపై నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజల పట్ల చిత్తశుద్ధితో పచిచేస్తున్నారని కొనియాడింది. కొన్నేళ్లుగా తమిళనాట తెలుగు వారిపై మండిపడుతున్న నామ్ తమిళర్ కట్చి అద్యక్షుడు సీమాన్.. వేలూరులో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల సభలో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు అమలు చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు.

సభలో ప్రసంగిస్తున్న నామ్ తమిళర్ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమాన్

దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, వితంతువులకు పింఛన్లు ప్రకటించటం.. ఎన్నుకున్న ప్రజల పట్ల సీఎం జగన్ ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. తమ రాష్ట్రం, తెలుగు జాతి సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉండటం హర్షనీయం అన్నారు. ఎప్పుడూ తెలుగువారిపై మండిపడే సీమాన్ ఏపీ సిఎం వైఎస్ జగన్ పై  ప్రశంసలు కురిపించటంపై తమిళ రాజకీయాల్లో చర్చగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement