డెమొక్రసీని కాంగ్రెస్‌ హైజాక్‌ చేసింది

Muralidhar Rao on Congress JDS Alliance in Karnataka - Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిన తీరును బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కన్నడ ప్రజల విశ్వాసాన్ని చురగొనడంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైందని, అయినా అప్రజాస్వామికంగా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందన్నారు.

పుంజుకున్నాం... ‘కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్‌ నినాదంతో 2014 కేంద్ర ఎన్నికల్లో ప్రారంభం అయ్యింది.  బీజేపీ కి కాంగ్రెస్ కు పోటా పోటీ ఎన్నికలు సాగాయి. ప్రతీచోటా కాంగ్రెస్‌కు పరాభవం తప్పడం లేదు. కర్నాటకలో బీజేపీకి 40 నుంచి 104 స్థానాలు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 122 స్థానాల నుండి 78 సీట్లకు పడిపోయింది. కన్నడ ప్రజలు విప్లవాత్మక తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌ భూతం రూపంలో కుమారస్వామిని పట్టుకుంది. ప్రజాతీర్పును వ్యతిరేకిస్తూ జేడీఎస్‌-కాంగ్రెస్‌లు ఏకమమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ.. ఆ పార్టీ అధినేత రాహుల్గాంధీ హైజాక్ చేశారు. కాంగ్రెస్‌ ఓ దిగజారుడు పార్టీ. సిద్ధరామయ్య ఘోరంగా ఓడిపోయారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్న విషయాన్ని కర్ణాటక ఫలితాలే నిరూపించాయి. లింగాయత్‌లను ఓటు బ్యాంకుగా చూసిన వారు పతనం చూశారు’ అని మురళీధర్‌ రావు తెలిపారు. 

చంద్రబాబుకు ఛాలెంజ్‌... ‘కర్ణాటకలో చాలా చోట్ల క్లీన్‌ స్వీప్‌ చేశాం. 36.2 శాతం ఓట్లు సాధించాం. కర్ణాటక తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఛాలెంజ్. అవసరమైతే డిబేట్ పెట్టుకుందాం రండి. ప్రజల్లో మోదీ ఛరిష్మా పెరిగిందే తప్ప..తగ్గలేదు అనటానికి ఆ ఫలితాలే నిదర్శనం. ఎన్ని దశలు మారినా చంద్రబాబు మోసచరిత్ర మారదు. ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడ ఉన్నా చంద్రబాబు చేసిన మోసానికి క్షోభిస్తూనే ఉంటుంది. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీతో వెళ్లటానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నేతలు చేసే అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేని ఏ వ్యక్తి కూడా నాయకుడిగా పనికి రాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలించేది ఒక్క బీజేపీ మాత్రమే’ అని మురళీధర్‌ రావు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top