ఎంపీటీసీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం

MPTC bypoll result in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఎంపీటీసీ ఉపఎన్నికల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 16 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం, నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కిష్టాపురంలో 208 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. అదే విధంగా ఎర్రబెల్లిలో 563 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నెం వెంకన్న విజయం సాధించారు. 

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి  561 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలిచారు.

భద్రాచలం ఎంపీటీసీ ఏడో స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 74 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి స్వరూప గెలుపొందారు. 

ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. సీపీఎం అభ్యర్థిపై 228 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.

మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని కన్మనూర్ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో 382 ఓట్లతో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ద

వనపర్తి జిల్లా గోపాల్ దిన్నె ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిపై 491 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇంకా మరికొన్ని ప్రాంతాల​ ఫలితాలు అందాల్సి ఉంది.

ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాలు:
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని నేట్నూరు, కౌతాల 
కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, అచ్చంపల్లి 
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంకుషాపూర్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏడో సెగ్మెంట్‌
ఖమ్మం జిల్లాలోని జక్కేపల్లి 
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కన్మానూర్‌, లింగంపల్లి
వనపర్తి జిల్లాలోని గోపాలదిన్నె
నల్లగొండ జిల్లాలోని కిష్టాపురం, ఎర్రబెల్లి
కామారెడ్డి జిల్లాలోని మద్నూరు 2
రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడ, జన్‌వాడ
సిద్దిపేట జిల్లాలోని ఆకునూరు 1
 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top