మోదీజీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉంది..

Modi Ji battle is over, Your Karma awaits you, says rahul gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మోదీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ తన నమ్మకాలపై ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ‘మోదీ జీ పోరు ముగిసింది. మీ ఖర్మ ఫలం ఎదురు చూస్తోంది. మీలో ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. మా తండ్రి మీద మీరు చేసిన వ్యాఖ్యల ద్వారా మీరేంటో  చెబుతున్నాయి. ఇక మిమ్మల్ని ఏవీ కాపాడలేవు. మీపై ప్రేమతో ఓ కౌగిలింత... రాహుల్’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా ఎన్నికల ప్రచారలంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ర్యాలీలో‘ రాజీవ్‌ గాంధీ తన జీవితాన్ని నంబర్‌ వన్‌ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ’  ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజీవ్‌ గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా మోదీ విమర్శలపై స్పందిస్తూ తన తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. రాజీవ్‌ త్యాగాన్ని కూడా ప్రధాని అవమానిస్తున్నారని ప్రియంక విమర్శించారు. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

అలాగే మోదీ వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి చిదంబరం స్పందిస్తూ.. అసలు మోదీకి ఏమైనా తెలుసా?. రాజీవ్‌ వచ్చిన ఆరోపణలు నిరధారమంటూ ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం మోదీ తెలుసుకోవాలన్నారు. నరేంద్ర మోదీ, రాజీవ్‌ గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, చిదంబరం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top