ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం  | Modi features in Benjamin Netanyahu election campaign | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

Jul 29 2019 8:34 AM | Updated on Jul 29 2019 8:34 AM

Modi features in Benjamin Netanyahu election campaign - Sakshi

ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో దిగిన ఫొటోలతో భారీ బ్యానర్లు రూపొందించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను ప్రపంచస్థాయి నేతననీ, ప్రతిపక్షాలు తనకు పోటీయేకాదని నెతన్యాహూ చెబుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌ భద్రత తనతోనే సాధ్యమని అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ గెలవడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటుకు ఏప్రిల్‌ 9న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ 35 సీట్లు సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. దీంతో సెప్టెంబర్‌ 17న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement