బాబు భక్తుడిగా ఉత్తమ్‌: కర్నె ప్రభాకర్‌

mlc karne prabhakar slams on congress, tdp leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు భక్తుడిలా మారారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శిం చారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే ఉత్తమ్‌ తెలంగాణ పీఠంపై అమరావతి బాస్‌లను కూర్చోబెడతారా అని ప్రశ్నిం చారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి కర్నె బుధవారం తెలంగాణభవన్‌లో మాట్లాడారు. ‘కేసీఆర్‌ కన్నా ఆంధ్రా పాలకులే నయమని ఉత్తమ్‌ మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. ఈ మాటలతో మొత్తం తెలంగాణ సమాజాన్నే ఆయన అవమానించారు. ఉత్తమ్‌కు సిగ్గుండాలి.. వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌ గొప్ప పాలకుడా, ఆంధ్రా పాలకులు గొప్పవారా అనే ఒక్క అంశంపైనే ఎన్నికలకు పోదామని ఉత్తమ్‌కు సవాలు విసురుతున్నా. 42 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణను ఎండబెట్టినందుకు ఆంధ్రా పాలకులు గొప్పవారా.. గాంధీభవన్‌కు బానిసభవన్‌ అని పేరు పెట్టుకుంటే మంచిది. ఇలాంటి బానిస ఆలోచనలున్న ఉత్తమ్‌ నల్లగొండలో తన సీటు గెలవడమే కష్టం. చంద్రబాబు పంపిన డబ్బులతో ఉత్తమ్‌ గెలవాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. నిరుద్యోగులకు తానేదో పేటెంట్‌ అని ఉత్తమ్‌ మాట్లాడుతున్నారు. అసలెన్ని ఉద్యోగాలున్నాయో ఆయనకు తెలుసా..  ’అని కర్నె ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top