కాంగ్రెస్ గుండా గిరికి ఇది నిదర్శనం | MLA Srinivas Goud Criticised Congres party In Assembly | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ గుండా గిరికి ఇది నిదర్శనం

Mar 12 2018 1:01 PM | Updated on Mar 18 2019 9:02 PM

MLA Srinivas goud - Sakshi

ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌

సాక్షి, హైదరాబాద్ ‌: బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్‌ పార్టీ సభలో గూండాగిరికి దిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్‌ పై హెడ్‌ఫోన్స్‌ విసరడం ఏమిటని ప్రశ్నించారు. కళ్ళు పోతే  బాధ్యులు ఎవరని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. సభలో  ప్రవర్తించిన తీరును చూసి ఎవరు హీరోలు కాలేరని జీరోలు మాత్రమే అవుతారని ఎద్దేవా చేశారు. ​కాంగ్రెస్‌ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రేపు మాట్లాడొచ్చని సవాల్‌ చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడేందుకు రేపు సమయాన్ని కేటాయిస్తామన్నారు. వారు కావాలనే గొడవకు దిగి బయటకు పోవాలని ఈ ప్లాన్‌ చేశారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీహార్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రవర్తించినట్లు ఇక్కడ ప్రవర్తిస్తే కుదరదని, ఇది తెలంగాణ అని కాంగ్రెస్‌ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement