‘వారంతా టీడీపీ పెయిడ్‌ కార్మికులే’

MLA Kottu Satyanarayana Comments On Pawan Kalyan - Sakshi

పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ధ్వజం

సాక్షి, తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌ అర్థరహితమని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్‌ అంటే పవన్‌కు అర్థం కూడా తెలియదన్నారు. రాష్ట్రంలో అవినీతిపరులుగా ముద్రపడిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి నాయకులతో సమావేశాన్ని పెట్టి ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారని పవన్‌ కల్యాణ్‌ను  ప్రశ్నించారు.

ఆనాడు ఎందుకు మాట్లాడలేదు..
ఇసుకపై అవగాహన లేకుండా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మాఫియాను గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఎత్తిచూపినప్పుడు మీరేందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గ్రీన్ ట్రిబ్యునల్  చంద్రబాబు ప్రభుత్వం పై 100 కోట్ల ఫైన్ వేసిందన్నారు. జనసేన పార్టీకి  దశ,దిశ లేదన్నారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాలను జనసేన ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. వరదల కారణంగానే ఇసుక లభ్యత కొరతగా ఉందన్నారు. ఇసుకపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఎటువంటి ఇబ్బందిలేదన్నారు. ఇసుక లభ్యత లేకపోవడం వలనే తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు. లాంగ్‌మార్చ్‌లో ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా లేరని, వచ్చినవారంతా టీడీపీ తీసుకొచ్చిన పెయిడ్‌ కార్మిలేనని కొట్టు సత్యనారాయణ తెలిపారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top