చంద్రబాబుపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు! | Minister KTR Sensation Comments On CM chandrababu | Sakshi
Sakshi News home page

Aug 1 2018 6:29 PM | Updated on Aug 30 2019 8:24 PM

Minister KTR Sensation Comments On CM chandrababu  - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వేదికగా చేసుకొని.. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఇటీవల కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగి.. బీజేపీతో ఘర్షణాత్మక వైఖరిని చంద్రబాబు అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీతో, అటు పవన్‌ కల్యాణ్‌ జనసేనతో పొత్తు పెట్టుకొని గట్టెక్కిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో చేసిన కాపురాన్ని వదులుకొని.. కొత్త ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. పాతమిత్రులు బీజేపీ, పవన్‌ దూరం కావడంతో.. కొత్త మిత్రుల కోసం ఆయన లోపాయికారిగా పావులు కదుపుతున్నారని, ఇందులోభాగంగానే  టీడీపీకి బద్ధవిరోధి అయిన కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని  రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు-కాంగ్రెస్‌ పొత్తుపై కేటీఆర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement