రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసినవారిపై చర్యలు తప్పవని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసినవారిపై చర్యలు తప్పవని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనిక్కడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్‌లు, గ్రూపులు ఎవరి వెంట ఉన్నాయో ప్రజలకు తెలుసునన్నారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన శ్రీనివాస్ హత్య గురించి.. ఎమ్మెల్యే వీరేశంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. వెంట తిరిగిన వారే శ్రీనివాస్‌ను చంపినట్టు అతని భార్యే చెప్పిందని గుర్తు చేశారు. శ్రీనివాస్‌కు ప్రమాదం ఉందని ఒక్క పిటిషన్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలే ఎన్‌కౌంటర్ చేస్తారని తెలిపారు.


