ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌; లక్నోలోనే మాయావతి

Mayawati Will Not Be Holding Any Meetings In Delhi Today - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల వెల్లడితో హస్తినలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో నేడు ఢిల్లీలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఈరోజు ఢిల్లీకి రావడం లేదని, లక్నోలోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు.

మరోవైపు శనివారం లక్నోలో మాయావతితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఈరోజు కూడా ఢిల్లీలో మాయావతిని ఆయన కలవనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడంతో చంద్రబాబు హస్తిన పర్యటన కూడా సందిగ్ధంలో పడినట్టు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి గరిష్టంగా 57 స్థానాల వరకు రావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. మహాకూటమికి 40 సీట్లు దాకా వచ్చే అవకాశముందని తెలిపాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని అంచనా వేశాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top