‘ప్రధాని అభ్యర్థిగా మాయావతి లేదా మమత’

Mayawati Or Mamatha PM Candidate Says Akhilesh Yadav - Sakshi

కోల్‌కత్తా: లోక్‌సభ ఎన్నికల ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అయితే బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్‌లో శనివారం మమత నిర్వహించిన ర్యాలీకి అఖిలేష్‌ హాజరైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అఖిలేష్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు. దేశంలో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ, మహాకూటమిని నడిపించగల శక్తి వారిలో ఉందని అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని,  ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని వ్యాఖ్యానించారు.

దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాందిపలుకుతుందని అఖిలేష్‌ పేర్కొన్నారు. యూపీ కూటమిలో కాంగ్రెస్‌ను దూరంగా పెట్టిన అఖిలేష్‌, మాయావతిలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమదూరం పాటిస్తున్న విషయం తెలిసిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top