‘అఫిడవిట్‌లో భార్య పేరు ఎందుకు ప్రస్తావించలేదు’ | Mamata Banerjee Asks Congress Leader Why Wife Name Not In Affidavit | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత విమర్శలకు దిగిన దీదీ

Apr 18 2019 10:19 AM | Updated on Apr 18 2019 10:22 AM

Mamata Banerjee Asks Congress Leader Why Wife Name Not In Affidavit - Sakshi

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపర కాళిలా మారారు. ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మీద వివర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయ ఆరోపణలు దాటి వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బరంపురం కాంగ్రెస్‌ అభ్యర్థి అధీర్‌ చౌదరీ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన భార్య పేరు ప్రస్తావించలేదని మమత ఆరోపించారు.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో నాకు అనవసరం. కానీ ఎన్నికల అఫిడవిట్‌లో అతను తన చనిపోయిన భార్య పేరును ప్రస్తావించలేదు. ఇది వాస్తావాలను దాచి పెట్టడం కాదా’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చౌదరీ రాజకీయంగా నన్ను విమర్శించే అవకాశం లేకే ఇలా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతన్నారని పేర్కొన్నారు. కానీ ఇలాంటివి చేయడం వల్ల తృణమూల్‌ విజయం సాధిస్తుంది అనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే అని స్పష్టం చేశారు. అధీర్‌ చౌదరీ  బరంపురం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి పార్లమెంట్‌కు వెళ్లాడు. ప్రస్తుతం బరంపురంలో విజయం కోసం తృణమూల్‌ తీవ్రంగా కష్టపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement