కూటమి ప్రతిపాదన తెచ్చింది నేనే: ఎల్‌ రమణ

L Ramana Criticises KCR In Congress Public Meeting In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల రాజ్యాంగం అవసరం లేదని అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగమే కావాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడాలన్న ప్రతిపాదనను తానే తెచ్చానని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న దొర తానే పీఠమెక్కి మాట తప్పాడని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. దొర పాలనలో తెలంగాణకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పేదలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. ప్రజలను అడుగడునా మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడి ప్రజాకూటమిని ఆశీర్వదించాలని కోరారు.

కేసీఆర్‌ది నిరంకుశ పాలన: చాడ
ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్‌ పాతరవేశారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటూనే అప్పులు చేశారని వెల్లడించారు. కేసీఆర్‌ నిరంకుశంగా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.

సంబంధిత కథనాలు

ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం

‘కేసీఆర్‌ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు’

దానికోసమే సోనియా గాంధీ వచ్చారు: రేవంత్‌ రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top