బాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు : కన్నబాబు | Kurasala Kannababu Thanks To YS Jagan Over YSR Kapu Nestham | Sakshi
Sakshi News home page

బాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు : కన్నబాబు

Jan 29 2020 3:20 PM | Updated on Jan 29 2020 3:24 PM

Kurasala Kannababu Thanks To YS Jagan Over YSR Kapu Nestham - Sakshi

సాక్షి, కాకినాడ : కాపు మహిళల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు. 

చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని కన్నబాబు మండిపడ్డారు. శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటే బాబును ప్రజలు మరింత తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్దిని చంద్రబాబు ఎంత కాలం అడ్డుకుంటారో తాము చూస్తామని ఘాటుగా స్పందించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే బాబు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. బినామీలకు చెందిన ఆస్తులను కాపాడుకోవడానికే బాబు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి బాబుకు అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement