
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఎన్నికల భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆర్‌సీ.కుంతియా అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయబోరని సింగరేణి కార్మికులు భావిస్తున్నారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు కార్మికులు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. బలమైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు కలవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.