తిరుగుబాటు నిజమే : కుమారస్వామి

Kumaraswamy Agrees That Tension Is There In Congress - Sakshi

సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమేనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. అయితే, సరైన నిర్ణయంతో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ తిరిగి గాడిలో పెట్టుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర రంగంలోకి దిగారు.

అయితే, ఆయన వారితో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్‌ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్‌, రోషన్‌ బేగ్‌, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్‌ గుండురావు, ఈశ్వర్‌ ఖండ్రే, షమనూర్‌ శివశంకరప్ప, సతీష్‌ జాక్రిహోలిలు కేబినేట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉ‍న్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top