'విచారకరం.. నేను చెప్పినా వినలేదు'

kumar viswas reaction about aap crisis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ రాష్ట్రపతికి సిఫారసు చేయడం దురదృష్టకరం, విచారకరం అని ఆ పార్టీ సీనియర్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ అన్నారు. ఆప్‌లో తాజా సంక్షోభంపై ఆయన శనివారం స్పందించారు.

'ఈ సంఘటన దురదృష్టకరం, విచారకరం. లాభదాయక పదవులను ఎమ్మెల్యేలకు కట్టబెట్టొద్దని నేను గతంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సలహాలు ఇచ్చాను. ఆయన పట్టించుకోలేదు. నియామకాలు జరపడం ముఖ్యమంత్రికి ఉన్న విశేష అధికారం అని నాకు చెప్పడం వల్లే నేను మౌనంగా ఉండిపోయాను' అని విశ్వాస్‌ అన్నారు. 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లాభదాయక పదవులను నిర్వహిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని, వారిని శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top