బాబు రైతుల భూములు లాక్కున్నప్పుడు ఎక్కడున్నావ్‌ పవన్‌? | Korumutla Srinivasulu Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

బాబు రైతుల భూములు లాక్కున్నప్పుడు ఎక్కడున్నావ్‌ పవన్‌?

Dec 2 2019 5:25 AM | Updated on Dec 2 2019 5:25 AM

Korumutla Srinivasulu Fires On Pawan Kalyan - Sakshi

రైల్వేకోడూరు: పవన్‌ కళ్యాణ్‌ ఒక అజ్ఞాని, చేతకాని దద్దమ్మ అని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరులో రైతు సంక్షేమం.. జనసేన ధ్యేయం పేరిట పవన్‌ ఎందుకొచ్చాడో ఏమి మాట్లాడుతున్నాడనేది ప్రజలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా ఉన్నాడని, ఆరోజు వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటే ఏమీ మాట్లాడకుండా ఎక్కడికి పారిపోయావని పవన్‌ను ప్రశ్నించారు. ప్యాకేజీ ఎవరు ఇస్తే వారి మాట మాట్లాడే గుణం మొదటి నుంచి పవన్‌కు ఉందన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement