దేవుడున్నాడు.. నిన్ను వదలడు: కోమటిరెడ్డి | Sakshi
Sakshi News home page

మరోసారి వాయిదా పడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక

Published Tue, Jan 28 2020 2:43 PM

Komatireddy Venkat Reddy Fires KCR Over nalgonda Municipal Elections - Sakshi

సాక్షి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సమావేశానికి కావాల్సిన సరైన కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌కు చెందిన 20 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరవ్వగా. టీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ప్రకటన ముందే జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో  మంత్రులు ఎమ్మెల్యేలు..ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురిచేశారని, ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావని విమర్శించారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో యాదగిరిగుట్టను కాంగ్రెస్‌ కైవసం చేసుకుందని తెలిపారు. ఆదిభట్లలో తమకు మోజారిటీ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్‌ను తీసుకుపోయి టీఆర్ఎస్ నుంచి ఛైర్మన్‌ పదవి ఇచ్చారని మండిపడ్డారు. (వీడిన సస్పెన్స్‌: నేరేడుచర్ల టీఆర్‌ఎస్‌దే)

పెద్ద అంబర్‌పేటలో తమ కౌన్సిలర్లను చౌటుప్పల్లో ఎత్తుకు పోయారని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అన్నారు. రజకార్లకంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని, కేటీఆర్ సిరిసిల్లలో రెబల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. నల్లగొండలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేటకు చెందిన తమ కౌన్సిలర్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని. వీరు చేసిన స్కాంలపై ఆధారాలతో ఈడీకీ, విజులెన్స్‌కు ఇస్తానని హెచ్చరించారు. గజ్వేల్లోమునిసిపల్ ఛైర్మెన్ గా 74 ఏళ్ల నారాయణ రెడ్డిని చేస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు.

చదవండి :  ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహాలు 

ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ దోపిడిని పార్లమెంటులో ఎండగడుతా. నా నియోజకవర్గం పరిదిలో 9 మున్సిపాలిటీ క్లియర్ మోజార్టీ వచ్చింది. కాని రెండే మాకు దక్కాయి. రెండు మూడు రోజుల్లో విద్యుత్తు చార్జీలు పెంచుతారు. చిన్న చిన్న గ్రామాలను మున్సిపాలిటీలు చేసారు. వాటిల్లో పన్నులు పెంచుతారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కేటీఆర్‌లకే మాత్రమే. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. నాకు పీసీసీ పదవిస్తే చేస్తా. లేకుంటే కార్యకర్త గా పనిచేస్తా. కేటీఆర్ సిగ్గుందా. నీది నోరా తాటిమట్టానా. గతంలో మా ఎమ్మెల్యేలను తీసుకుంటే నీ బిడ్డ ఓడిపోయింది. పైన దేవుడున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో చేసింది వదిలిపెట్టడు. కేసీఆర్ కేటీఆర్‌లు సిగ్గు లేకుండా పనిచేస్తున్నారు. మిమ్మల్ని వదిలి పెట్టం..గ్రామ గ్రామాన తిరుగుతాం. మిమ్మల్ని ఎండ గడుతాం.’’ అంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి :  వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే

Advertisement
 
Advertisement
 
Advertisement