గెలిచినా, ఓడినా ప్రజల్లోనే..

Kodandaram says KCR demolished all systems, Sure of alliance victory - Sakshi

మీట్‌ ది ప్రెస్‌లో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

ఎక్కడికీ పారిపోం.. రాజకీయాల నుంచి తప్పుకుంటామనం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పబోనని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే పనిచేస్తానని, పదవి అనేది ఒక వెసులుబాటు మాత్రమేనన్నారు. సోమవారం ఇక్కడి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూ జే నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆయన మాట్లాడారు.

సీఎంగా కేసీఆర్‌ స్థిరంగా ఉన్నా రాష్ట్రంలో అస్థిరత విపరీతంగా పెరిగిపోయిందని, ప్రభుత్వం పట్ల విశ్వసనీయత సన్నగిల్లిందన్నారు. ఇంతటి అస్థిరత ను ఎప్పుడూ చూడలేదని, సీఎం పదవే ఎక్కువ విమ ర్శలకు గురైందని పేర్కొన్నారు. ప్రజల విశ్వసనీయ తను ఎంతమేరకు చూరగొన్నామన్నదే ముఖ్యమని, సీఎంలు ఎంతమంది మారుతారన్నది ముఖ్యం కాదన్నారు. వ్యక్తుల వల్ల రాజకీయాల్లో స్థిరత్వం రాదన్నా రు. రాష్ట్రంలోనూ సీఎం, మంత్రుల వాహనాల సైరన్‌ మోతలు ఆగిపోవాలని, బుగ్గలను పీకేయాలని సూచించారు. ఓట్లు వేసిన ప్రజలు తిడితే పడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ఏం చేశారని కేసీఆర్‌కు ఓటేయాలి?
సీఎం తన కుటుంబం కోసం అధికారాన్ని సొంత ఆస్తిగా వాడుకుంటున్నారని కోదండరాం ఆరోపిం చారు. ‘ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం అందరి కోసం పని చేయాలి. కానీ కొందరి కోసమే పని చేస్తోంది’ అని అన్నారు. సీఎంకు ఒక కార్యాచర ణ అంటూ లేదని, ప్రభుత్వాన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారని, కమీషన్లు, సంపాదనకు వాడుకుం టున్నారని ఆరోపించారు. ‘అధికారం అనేది ప్రజల కోసం పని చేయాలి. ఉద్యోగాలు కల్పించాలి. పారి శ్రామిక, వ్యవసాయ, ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలి’ అని అన్నారు.

అవకాశం ఇస్తే తమ ఎజెండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఓ వైపు నిరంకుశ పాలన, మరోవైపు ప్రజల ఆకాం క్షలు ఉన్నాయని, ఆ రెండింటిలో ఏ వైపు ప్రజలు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘కేసీఆర్, నలుగురు కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మేము మాత్రం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలనుకుంటున్నాం. ఇదీ ఇప్పడున్న ఘర్షణ, ఎన్నికల వేదికగా అటో ఇటో తేలి పోవాలి’ అని అన్నారు. నాలుగున్నరేళ్ల పాలన కేసీ ఆర్‌ ఏం చేశారని టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటు వేయాలని కోదండరాం ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు..
తెలంగాణ ఏర్పాటు అనేది చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని కోదండరాం చెప్పారు. ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడే కొత్తతరం నాయకత్వం అవసరమన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని, పీకేసిన కొద్ది మొలుస్తూ నే ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే, తాము గెలిచినట్టేనన్నారు.

ఉమ్మడి కార్యాచరణకు చట్టబద్ధత
ప్రజల ఆకాంక్షలతో కూడిన ఉమ్మడి ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు రాహుల్‌గాంధీ ఒప్పుకున్నార ని కోదండరాం అన్నారు. మత ఘర్షణల నిరోధానికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఢిల్లీకి పోవడం సాధ్యం కాదన్నారు. డిప్యూటీ చీఫ్‌ మినిçస్టర్‌ పదవి వస్తదన్న ఆశలో తాను లేనని తెలిపారు.

కాంగ్రెస్‌ ఉంటే రామన్న సీపీఎం
కూటమిలోకి రావాలని అడిగితే సీపీఎం నేతృత్వం లోని బీఎల్‌ఎఫ్‌ నేతలు కాంగ్రెస్‌తో కలువబోమని చెప్పారని కోదండరాం చెప్పారు. కాంగ్రెస్‌తో కలవకుండా ఇప్పుడు నిలదొక్కుకోవడం సాధ్యం కాదని కూటమిలోని మిగతా పక్షాలు చెప్పాయన్నారు. అందుకే కామన్‌ ప్రోగ్రాం రాసుకొని దానికోసం పని చేద్దామని చెప్పారని, ఆ మేరకే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

నిరంకుశంగా పాలించారు
కేసీఆర్‌ నాలుగున్నరేళ్లు నిరంకుశంగా పరి పాలించారని, రాజకీయమంటే డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడమని అనుకుంటున్నారని కోదండరాం ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం రాజకీయం కాదన్నారు. ఒక పార్టీలో టికెట్లు రాని వారు మరోపార్టీ లోకి మారుతున్న తరుణంలో అలాంటివారితో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అసాధ్యమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top