ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ | Telangana: Prof Kodandaram and Amir Ali Khan take oath as MLCs | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌

Aug 17 2024 5:09 AM | Updated on Aug 17 2024 5:09 AM

Telangana: Prof Kodandaram and Amir Ali Khan take oath as MLCs

మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్‌ అయిన ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, శాసనసభలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతోపాటు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్‌ గుత్తా అభినందించడంతోపాటు వారికి గుర్తింపు పత్రం, మండలి నియమావళిని అందజేశారు. అనంతరం మండలి చైర్మన్, మంత్రులతో కలసి కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement