ప్రభుత్వాన్ని కూలుస్తాం: కోదండరాం

Kodandaram blames TRS Govt - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన సరిగా లేదని, ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కోదండరాం ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు కేంద్రం నుంచి లక్షల కోట్లు వచ్చాయన్న కోదండరాం.. ఆ లక్షల కోట్లు ఎక్కడిపోతున్నాయో సీఎం కేసీఆరే చెప్పాలన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీకి సైతం డబ‍్బులు ఇవ‍్వడం లేదని ఆరోపించారు. ఈ రాజకీయాలను సమాధి చేస్తామంటూ  హెచ్చరించారు. సీఎం నాటిన మొక్కకు పోలీస్‌ సెక్యూరిటీ ఇచ్చారని ఎద్దేవా చేసిన కోదండరామ్‌.. మరి అంత ప్రేమ రైతుల పంటలపై లేదా? అని నిలదీశారు.

తెలంగాణలో బలమైన రాజకీయ ఏకీకరణ చేస్తామన్నారు. వచ్చే నెల రెండో వారంలో పార్టీ కార్యాచరణను ఉధృతం చేస్తామన్నారు. ప్రస్తుత రాజకీయాలను తట్టుకునే శక్తి టీజేఎస్‌కు ఉందని కోదండరాం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top