కేసీఆర్‌ అసహనం ఓటమికి సంకేతం: సీపీఎం

KCR is a sign of impatient defeat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో పార్టీ కేడర్‌పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేయడం టీఆర్‌ఎస్‌ ఓట మికి సంకేతం అని సీపీఎం అభివర్ణించింది. టీఆర్‌ఎస్‌ పాలనలో చెప్పిం ది ఎక్కువ చేసింది తక్కువ, అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఆ పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు.

బుధవారం ఎంబీభవన్‌లో పార్టీ నాయకులు టి.జ్యోతి, డి.జి.నర్సింహారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం– సమగ్రాభివృద్ధి సాధన దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పోటీచేస్తున్న సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండటంతో, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి లోక్‌సభ ఎన్నికలకు ముందు పట్టు సాధించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారన్నారు.

పాలకపార్టీకి ఈసీ వత్తాసు
అధికార టీఆర్‌ఎస్‌కు ఈసీ వత్తాసు పలికేలా వ్యవహరిస్తోందని జ్యోతి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పంపిణీ కోసం గ్రామాలకు చేరుతున్నా ఈసీ ఉదాసీనంగా ఉందన్నారు. ఇప్పటికై నా డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేలా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమపథకాల చుట్టే ప్రధానపార్టీల మేనిఫెస్టోలు తిరిగినా, మౌలికంగా మార్పు ఎలా తెస్తారు, పథకాల అమలుకు అవసరమైన డబ్బును ఎలా సమకూరుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top