ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన కేసీఆర్‌ | KCR extend wishes to TRS Winning Condidates in MLC Elections | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ అభినందనలు

Jun 3 2019 10:46 AM | Updated on Jun 3 2019 10:58 AM

KCR extend wishes to TRS Winning Condidates in MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. ఎమ్మెల్సీలు విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఏకపక్ష విజయం ఇచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement