19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

KCR Cabinet expansion on 19th February - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ తర్వాతే కేబినెట్‌ విస్తరణ తేదీ అధికారికంగా వెల్లడి అయింది. ఈ విస్తరణలో 10మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్...మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు.

ఇక టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది.  గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఇంకా తెలియరాలేదు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top