నాయకుల ప్రేమలపై కత్తి వాలెంటైన్స్‌ సెటైర్లు..! | kathi mahesh valentines day tweet | Sakshi
Sakshi News home page

Feb 14 2018 12:47 PM | Updated on Mar 22 2019 5:33 PM

kathi mahesh valentines day tweet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మోదీ అంటే చంద్రబాబుకు ప్రేమ.. చంద్రబాబు అంటే పవన్‌ కల్యాణ్‌కు ప్రేమ.. పవన్‌ కల్యాణ్‌ అంటే జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రేమ.. హ్యాపీ వాలెంటైన్స్‌ డే’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఒకవైపు సినిమాలపై రివ్యూలు రాస్తూనే.. మరోవైపు తాజా రాజకీయాలపై కత్తి మహేశ్‌ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ జేఏసీ లేదా జేఎఫ్‌ఎఫ్‌సీ పేరిట పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న రాజకీయాలపై కత్తి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘ఏపీ జేఏసీ లేదా జేఎఫ్‌ఎఫ్‌సీ వల్ల అద్భుతాలు ఏమీ జరగవు: నాగభైరవ జయప్రకాష్ నారాయణ్
తెలుసు..
ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అరిచి గోలపెట్టకుండా సమస్యని ఎలా తీర్చవచ్చో ఆలోచిస్తాం: నాగభైరవ జయప్రకాష్ నారాయణ్
ఎస్.. అర్థం అవుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాఉద్యమం జరగకుండా చూసుకుంటారు. భేష్!!’అని  కతి మహేశ్‌ ట్వీట్‌ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement