
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఫాతిమా కళాశాల విషయంపై లేఖ రాశారు, దీంతోపాటు పవన్ ట్వీట్ కూడా చేశారు. ఈ విషయంపై కత్తి మహేష్ తన ఫేస్‌బుక్ వేదికగా ‘మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు.’ అని కామెంట్ చేశారు.