
సీఎం యడ్యూరప్పను సన్మానిస్తున్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి
సాక్షి,బళ్లారి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కితాబు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్‌రెడ్డితో పాటు పలువురు నేతలు శుక్రవారం యడ్యూరప్పను బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టించిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు ఆదర్శనీయమని కొనియాడారు.