కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

Karnatak Speaker Ramesh Kumar Emotional Speech In Assembly - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో స్పీకర్‌ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నారు. సభలో చర్చలో భాగంగా స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. గత కొన్ని రోజులుగా సభలో జరిగే పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు కనీస సంప్రదాయలు పాటించకుండా స్పీకర్‌ పదవిలో ఉన్న తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవికి తాను పూర్తిగా న్యాయం చేసినట్లు భావిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ ప్రమాణాల మేరకు సభను నిర్వహించానన్నారు.

సభలో జరగబోయే పరిణామాలను తాము ముందే ఊహించి.. తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు  వెల్లడించారు. తానేంటో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. కాగా సభలో సీఎం కుమార స్వామి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఓటింగ్‌కు తాము సిద్ధమేని...కానీ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ జరపాలని  స్పీకర్‌ని కోరారు. దానికి స్పీకర్‌ నిరాకరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top