వడివడిగా కమల్‌ అడుగులు! | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 21 2018 8:45 AM

Kamal Haasan visits APJ Abdul Kalam house in Rameswaram - Sakshi

సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ బుధవారం ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్‌ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్‌ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం అక్కడి నుంచి మదురై బయలుదేరారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్‌ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి.. పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

సాయంత్రం మదురైలో నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ పేరు, పతాకం, పార్టీ లక్ష్యాలను కమల్‌ ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్‌లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు రజనీకాంత్, విజయ్‌కాంత్‌లను కమల్‌ కలుసుకున్నారు.

Advertisement
Advertisement